మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తాజాగా పలకరించిన సినిమానే “మెకానిక్ రాకీ”. అయితే ఈ సినిమా అనుకున్న అంచనాలు అందుకోలేదు కానీ ఈ సినిమా తర్వాత విశ్వక్ సేన్ చేస్తున్న మరో సినిమా “లైలా” తో హిట్ కొట్టాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన టీజర్ లో లేడీ గెటప్ తో అదరగొట్టిన విశ్వక్ సేన్ ఇపుడు ఫైనల్ గా ట్రైలర్ తో ట్రీట్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు.
తన మరో షేడ్ సోను మోడల్ అలాగే లైలా రెండు గెటప్స్ లో ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ ఫిబ్రవరి 6న ట్రైలర్ తో పలకరించేందుకు వస్తున్నట్టుగా ఇపుడు ప్రకటించారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఆరోజు వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. అలాగే ఈ సాహు గారపాటి నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 14న విడుదల అవుతుంది.