కిరణ్‌ అబ్బవరం దెబ్బ…తమిళ స్టార్స్‌ అబ్బా!

Thursday, November 7, 2024

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా సినిమా ‘క’. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. సందీప్ – సుజిత్ అనే కొత్త డైరెక్టర్స్ తీసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో  మంచి బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేసింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31 న ఈ చిత్రం విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు తమిళ్ ఇండస్ట్రీ నుంచి పెద్దగా సపోర్ట్ లేదు. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ‘క’ సినిమాను కొనేందుకు ముందుకు రాకపోవడంతో హీరో కిరణ్ అబ్బవరం కొంత నిరుత్సాహాన్ని వ్యక్త పరిచాడు.

దీనిపై ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..’ తరుచుగా డబ్బింగ్ చిత్రాలకు మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ఎంతో మంచి సపోర్ట్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. కానీ తమిళ పరిశ్రమ తెలుగు సినిమా పట్ల తక్కువ ప్రాధాన్యత ఇస్తోందని’ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తమిళ్ విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం. ఇదే విషయమై ఇండస్ట్రీలో పలు అనుమానాలు లేవనెత్తాయి. కిరణ్ అబ్బవరం అంటే తమిళ స్టార్స్ భయపడుతున్నారా? లేక దీపావళికి కేవలం తమ సినిమాలే ఉండాలని ఫిక్స్ అయ్యారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ దీపావలికి తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ‘అమరన్’ రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం తో పోటీ ఎందుకని జాగ్రత్త పడుతున్నారా? అనేది మరికొందరి వాదన. కేవలం తమిళమే కాదు అటు మలయాళ, కన్నడ, హిందీలోనూ ఈ సినిమా అక్టోబర్ 31 న రిలీజ్ అవ్వడం లేదు. ఓన్లీ తెలుగు వెర్షన్ మాత్రమే ఆ రోజు విడుదలవుతుంది. మిగతా భాషల్లో ఒక వారం ఆలస్యంగా రిలీజ్ చేయనున్నారు. మరోవైపు మలయాళంలో మాత్రం కావాలనే చెప్పిన డేట్ కు తమ సినిమాను రిలీజ్ చేయడం లేదని కిరణ్ అబ్బవరం చెప్పారు.

అందుకు కారణం తన సినిమాను కోన్ దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ చిత్రానికి పోటీగా వెళ్లకూడదని డిసైడ్ అయినట్లు తెలిపారు. ‘క’ సినిమా కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దుల్కర్ సల్మాన్ కొనుగోలు చేశాడు. అతని లాగే కోలీవుడ్ లోనూ ఈ హీరోకు సపోర్ట్ ఉంటే మంచింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles