కంగువలో..ఓ స్వీట్‌ సర్పైజ్‌!

Friday, September 20, 2024

కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ సినిమా ‘కంగువ’ అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా  విడుదలకు సిద్దమయ్యింది. కంగువ’ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తీర్చిదిద్దుతున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కంగువ సినిమాను భారీ బడ్జెట్‌ తో తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదల చేసిన సిజిల్ టీజర్, పోస్టర్స్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి.

పీరియాడిక్ యాక్షన్ జోనర్‌  లో ఇప్పటి వరకు తెరపైకి రాని ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోందీ ఈ చిత్రం పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీగా ‘కంగువ’ సినిమాపై అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పరిచింది. ఇదిలా ఉండగా సూర్య సోదరుడు కార్తీ కంగువ క్లైమాక్స్ లో అతిథి పాత్రలో మెరుస్తాడని సమాచారం. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉందని, సూర్య – కార్తీల ఎపిసోడ్ సీక్వెల్‌కు దారితీస్తుందని సమాచారం. ఈ సినిమాలో జగపతి బాబు, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles