కబాలీ నిర్మాత ఆత్మహత్య! తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం జరిగింది. ప్రముఖ నిర్మాత కె.పి.చౌదరి(సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి) ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మృతి ని పోలీసులు ఆత్మహత్య అని నిర్ధారించడంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయ్యింది.
2023లో మాదక ద్రవ్యాల కేసులో సైబరాబాద్ పోలీసులు కె.పి.చౌదరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఘటన తర్వాత ఆయన తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లారని.. ఈ కారణంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. గోవాలో ఓ క్లబ్ స్టార్ట్ చేయాలని ఆయన అక్కడకు వెళ్లారు. కానీ, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రానికి తెలుగు నిర్మాతగా కె.పి.చౌదరి వ్యవహరించారు. ఆయన గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం వంటి చిత్రాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు.