చేతులు మారిన జై హనుమాన్‌!

Saturday, December 7, 2024

క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జా లీడ్ రోల్ లో వచ్చిన హనుమాన్ సూపర్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లు రాబట్టింది. సంక్రాంతి కానుకగా వచ్చి వందకోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే సిక్వెల్ లో కీలకమైన హనుమాన్ పాత్రకు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ని తీసుకున్నారని వార్తలు వినపడుతున్నాయి.

దీనిపై అధికారకంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ సీక్వెల్ యూజ్ సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం జై హనుమన్ ప్రాజెక్ట్ చేతులు మారినట్టు సమాచారం. వాస్తవానికి హనుమాన్ ను నిర్మించింది నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు . ఇప్పుడు రాబోయే జై హనుమాన్ కూడా అదే బ్యానర్ లో చేయాల్సి ఉంది. తమ బ్యానర్ లోనే నిర్మిస్తామని కూడా ప్రైమ్ షో నిర్మాతలు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే.

కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రైమ్ షో నుండి బడా మేకర్స్ వద్దకు వచ్చి చేరిందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు అడిగిన రెమ్యునరేషన్ ను ఇచ్చేందుకు సుముఖంగా లేరని, అలాగే లాభాల వాటా అంటే గిట్టుబాటు కాదని అందుకు కారణంగా ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ చేతిలోకి వెళ్ళింది అన్న మాట ఒకటే గుస గుస వినిపిస్తుంది.

త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles