అంతా దాని వల్లే…అంటున్న ముద్దుగుమ్మ!

Sunday, October 13, 2024

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన 20 ఏళ్ల మంగళూరు బ్యూటీ కృతి శెట్టి అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తుందనే విషయం చాలా మందికి తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా చర్మ సంరక్షణ కోసం ఆమె చాలా కష్ట పడుతోంది. కృతి చర్మం కొరియన్ చర్మంలా కనిపించడానికి కారణం ఏమిటో ఆమె తాజాగా బయటపెట్టింది.

‘‘నేను చదువుకునే రోజుల్లో అమ్మతో కలిసి పుస్తకాల షాపుకి వెళ్లేదాన్ని, అప్పుడు అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని పుస్తకం కొన్నా. వావ్, నా కుమార్తెకు పుస్తకం కావాలని అమ్మ సంతోషించింది, కానీ నేను ‘హౌ టు బి గార్జియస్’ అనే పుస్తకాన్ని కొన్నాను.  ఈ పుస్తకం చదవడం ద్వారా అందం మీద మరింత శ్రద్ద పెరిగింది. రోజూచర్మాన్ని రెట్టింపు శుభ్రపరచడం, ఉదయాన్నే సన్‌స్క్రీన్ అప్లై చేయడం వల్ల నా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కృతి శెట్టి వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను టోనర్‌ను రోజు వాడుతున్నానని చెప్పింది.

అంతేకాకుండా షుగర్‌ని విడిచిపెట్టినప్పటి నుండి చర్మంలో చాలా మార్పులు వచ్చాయని, ఏ ప్రాడెక్ట్ వాడినా కూడా షుగర్‌ని వదిలేసే మ్యాజిక్ చేయలేదని ఆమె తెలిపింది. ఇక బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నాకు స్ఫూర్తి, ఆమె ఆత్మవిశ్వాసం నాకు చాలా ఇష్టం అని కృతి వివరించింది. మన చుట్టూ ఉండే పర్యావరణం చాలా ముఖ్యం అని ఆమె అన్నారు.

తనకు డ్యూయి స్కిన్, లైట్ మేకప్ అంటే ఇష్టం అని అన్నారు. బాక్సీ కనుబొమ్మను కలిగి ఉండటం ఒక ట్రెండ్, అది కూడా ట్రై చేద్దాం అనుకున్నానని ఆమె అన్నారు. ఖాళీ సమయాల్లో పైలేట్స్, ఏరియల్ యోగా, డ్యాన్స్ చేస్తా అంటూ తన అందం గురించి చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles