సినీ కెరీర్ లో మొదటిసారి విలన్‌ గా కనిపించబోతున్న వెంకీ మావ!

Sunday, December 8, 2024

సీనియర్‌ స్టార్‌ హీరో వెంకటేష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అయితే వెంకీ మావ ఇప్పటి వరకు టాలీవుడ్ సీనియర్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వెంకీ మావ… హీరోగా ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించిన వెంకటేష్ సపోర్టింగ్ రోల్స్ లో కూడా చేశారు మల్టీస్టారర్ మూవీస్ లో కూడా నటించారు.

అయితే తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అభిమానులకి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది .ఇప్పటి వరకు తన కెరియర్లో ఎన్నడూ చేయని చాలా పెద్ద రిస్క్ వెంకీ చేయబోతున్నాడు. ఆయన ఓ తెలుగు హీరో సినిమా కోసం ఏకంగా విలన్ గా మారబోతున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. హీరో నాగచైతన్య తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడనే విషయం తెలిసిందే.

ఆ సినిమా తర్వాత విరుపాక్ష డైరెక్టర్ తో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్‌లో వెంకటేష్ కనిపించబోతున్నాడట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు. మేనల్లుడి కోసం ఇంత రిస్క్ చేస్తున్నావా మామ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles