తనతో మాట్లాడాలంటే ఏదోలా అనిపించింది!

Saturday, October 12, 2024

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ- రష్మిక బాండింగ్‌ గురించి టాలీవుడ్‌ లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరూ మొట్టమొదటిసారిగా గీతగోవిందం అనే సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత రష్మిక తనకు జరిగిన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవడంతో అప్పటి నుంచి విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో నడుస్తూ ఉందనే ప్రచారం జరుగుతుంది.

దానికి తోడు వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కూడా రకరకాల హింట్స్ ఇచ్చే విధంగా ఉండటంతో ఈ ప్రచారం జోరందుకుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడూ తమ రిలేషన్ గురించి బయట మాట్లాడింది లేదు. వీలైతే అప్పుడప్పుడు ఖండిస్తూనే ఉంటున్నారు. కానీ వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు మాత్రం అనుకుంటున్నారు. అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రష్మిక మందన విజయ్ దేవరకొండ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

అదేంటంటే గీతగోవిందం సినిమా సెట్స్ లో విజయ్ దేవరకొండ పక్కన నటిస్తున్నప్పుడు అతని గత సినిమాల ఎఫెక్ట్‌ తో అతనితో మాట్లాడాలంటే ఎందుకో బెరుకుగా అనిపించదని చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమాల్లో చూసిన విజయ్ దేవరకొండ వేరు, బయట విజయ్ దేవరకొండ వేరు అని తనకు త్వరగానే అర్థమైందని ఆమె పేర్కొంది. సినిమాల్లో చూపించినట్టు కాకుండా బయట విజయ్ చాలా కూల్ అని ఎవరైనా ఈజీగా మాట్లాడగలిగే అంత మంచి వ్యక్తిని చెప్పుకొచ్చింది. బహుశా అందువల్లే తనకు విజయ్ తో వాళ్ళ ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఏర్పడిందని ఆమె చెప్పుకొచ్చింది. ఫ్యూచర్లో విజయ్ తో సినిమా చేస్తారా? అని అడిగితే ప్రస్తుతానికైతే చేసే ఆలోచనలు ఏమీ లేవు అని చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles