వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదేనా!

Saturday, December 7, 2024

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమా ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే, అవి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేదు. దీంతో ఇప్పుడు తన నెక్స్ట్ మూవీని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఈ యువ హీరో.

ఈ క్రమంలో దర్శకుడు కృష్ణ చైతన్య చెప్పిన ఓ కథకు వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ డైరెక్టర్ తన రీసెంట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో ప్రేక్షకులను మెప్పించాడు. దీంతో ఇప్పుడు ఈ కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి క్రియేట్ అవుతుంది. అయితే, ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ని కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్రానికి ‘‘వచ్చాడయ్యో సామీ’’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేయనున్నారట. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles