టాలీవుడ్‌ సినిమాలో సామ్‌..హిట్ కాంబో రిపీట్ కాబోతుందా!

Monday, October 14, 2024

టాలీవుడ్ స్టార్ నటి సమంత చాలా కాలం నుంచి తెలుగు సినిమాలతో పాటు..ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో కూడా తన హాట్‌ ఫోటోలను పెడుతూ  కుర్రకారును అందాలతో పిచ్చెక్కిస్తోంది.

ఈ క్రమంలోనే ఓ హెల్త్ పాడ్ కాస్ట్ మొదలెట్టి అందులో పలు విషయాలు చెబుతుంది. అలాగే ఆదివారం తన పుట్టిన రోజు కావడంతో అభిమానులకు ఓ గుడ్ న్యూస్ తెలిపింది. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో రాబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ను విడుదల  చేసింది. అయితే సమంత మరో పాన్ ఇండియా సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న మూవీలో సామ్‌ను కథానాయికగా ఎంపిక  చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, సమంతకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. రామ్ చరణ్- సుకుమార్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందన్న సంగతి తెలిసిందే.ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అయితే ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా సామ్‌ను తీసుకున్నట్లు టాక్. సుకుమార్ మాటిచ్చి నట్లుగా సమంతను సెలెక్ట్ చేసుకున్నారట.

ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రెండు సినిమాలు హిట్ అయ్యేవే కాబట్టి ఆమె కెరీర్‌లో మళ్లీ వరుస ఆఫర్స్‌తో దూసుకుపోవడం ఖాయమని అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles