నాని..బన్నీ మధ్య ఆసక్తికర సంభాషణ..సోషల్‌ మీడియాలో వైరల్‌!

Sunday, December 8, 2024

69 వ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 లో దసరా సినిమాకి ఏకంగా ఆరు అవార్డులు సొంతమైన సంగతి తెలిసిందే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ పరిచయ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ కేటగిరీల్లో సినిమాకి అవార్డులు వరించాయి. దసరా సినిమాలోని నటనకు గాను ‘నేచురల్ స్టార్’ నాని ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా అవార్డుతో దిగిన ఓ ఫొటోను నాని తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా..దీని గురించి తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్పందించాడరు.

ఈ క్రమంలో టాలీవుడ్‌ స్టార్స్‌ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అవార్డుతో దిగిన ఫొటోను నాని తన ట్విటర్‌ ఖాతాలో  షేర్‌ చేయగా.. దీనిపై అల్లు అర్జున్‌ స్పందించారు. ‘కంగ్రాట్స్ నాని. ఈ అవార్డుకు నువ్వు పూర్తి అర్హుడివి’ అని బన్నీ తెలిపారు. దీనికి నాని స్పందిస్తూ.. థ్యాంక్యూ బన్నీ… వచ్చే ఏడాది రూల్ చేసే వ్యక్తి మరెన్నో అవార్డులను ఇంటికి తీసుకువెళ్తాడని ఆశిస్తున్నా’ అని పుష్ప ది రూల్‌ను ఉద్దేశించి ఆసక్తికర రిప్లై ఇచ్చారు.

ఈ పోస్ట్‌పై అల్లు అర్జున్‌ స్పందించారు. ‘అది నిజమవుతుందని నేను ఆశిస్తున్నా’ అని బన్నీ కూడా పేర్కొన్నాడు. బన్నీ, నాని మధ్య ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సినిమా పూర్తి చేశారు. వివేక్‌ ఆత్రేయ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ మూవీ నెల 29 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా చేయగా.. ఎస్‍జే సూర్య కీలక పాత్ర‌ లో నటించాడు. మరోవైపు ‘పుష్ప ది రూల్‌’తో అల్లు అర్జున్‌ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. లెక్కల మాస్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. డిసెంబర్‌లో విడుదల చేసేందుకు చిత్రబృందం రెడీ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles