నేను రచ్చ గెలిచాను…ఇంట గెలిచాను!

Saturday, November 9, 2024

ప్రతిష్టాత్మకమైన ఏఎన్నార్ నేషనల్ అవార్డు ప్రదానోత్సవం నిన్న కన్నుల పండువగా జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని కుటుంబ సభ్యులు అందించే ఈ ప్రెస్టీజియస్ అవార్డును 2024 సంవత్సరానికి గానూ మెగాస్టార్ చిరంజీవికి ఇచచారు. అయితే, ఈ అవార్డు ప్రదానోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘‘వజ్రోత్సవాల సమయంలో నాకు లెజండరీ పురస్కారం ప్రదానం చేయబోయారు. కానీ, ఆరోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో, నాకు ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితంగా అనిపించలేదు. అందుకే ఆరోజు ఆ అవార్డుని ఓ క్యాప్సుల్‌ బాక్స్‌లో పడేసి.. నాకు అర్హత ఎప్పుడొస్తుందో అప్పుడు తీసుకుంటానని చెప్పాను’ అన్నారు.

చిరు ఇంకా మాట్లాడుతూ.. ‘అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేకపోయాను. కానీ, ఏఎన్నార్‌ అవార్డును అందుకున్న ఈరోజున ఇప్పుడు అనిపిస్తోంది.. ‘నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను’ అని. మా అమ్మగారు ఏఎన్నార్‌కు పెద్ద అభిమాని. నాకు కూడా ఆయన డ్యాన్సులంటే చాలా ఇష్టం. అలాంటి ఏఎన్నార్‌ నా గురించి మాట్లాడుతూ.. ‘నాకు ఎముకలున్నాయి.. చిరంజీవికి ఎముకలు లేవ’ని ఓసారి ప్రశంసించారు. ‘నేను డ్యాన్సులకు ఆద్యుణ్ని. ఆ డ్యాన్సులకు స్పీడ్, గ్రేస్‌ పెంచింది చిరంజీవే’ అని చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ చిరు చెప్పుకొచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles