పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు విడుదలపై మరోసారి అనిశ్చితి నెలకొంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ మొదట్లో ఎలా ఊహించారో, ఆ స్థాయిలోనే చాలామంది అంచనాలు పెట్టుకున్నారు. కానీ రిలీజ్ విషయంలో మాత్రం ఈ సినిమా కంటిన్యూగా తేడాలు ఎదుర్కొంటూ వాయిదా పడుతుండడం అభిమానుల్లో నిరాశను పెంచుతోంది.
ఇప్పటికే కొన్ని డేట్స్ ప్రకటించి మళ్ళీ మారుస్తూ వచ్చిన మేకర్స్, తాజాగా మళ్లీ రెండు తేదీలను దృష్టిలో పెట్టుకున్నట్టు ఫిలింనగర్ టాక్. ఒకవైపు జూన్ 27 అని వినిపిస్తుండగా, మరోవైపు జూలై 4 కూడా పరిశీలనలో ఉందట. అయితే ఈ రెండు తేదీల్లో ఎప్పటికీ ఫిక్స్ అవుతుందో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అభిమానులు మాత్రం ఈసారి అయినా సినిమా థియేటర్లలో చూసే అవకాశం రావాలని ఆశగా ఉన్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఇంతకుముందు విడుదలైన లుక్స్, గ్లింప్స్ చూసినవారు భావిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి అందిస్తున్న సంగీతం కూడా సినిమాకి స్పెషల్ హైలైట్ అవుతుందని టాక్. అలాగే ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఇన్ని వాయిదాల తర్వాత అయినా ఈసారి సినిమా ఫైనల్‌గా వస్తుందా లేదా అన్నదే ఇప్పుడు సినీప్రేమికుల్లో చర్చకు మారింది.