“హను మాన్” మేనియా ఇక జపాన్లోకి…విడుదల తేదీ ఎప్పుడంటే!

Friday, December 6, 2024

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా హీరోగా యంగ్ ముద్దుగుమ్మ అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్‌  హిట్ సినిమా “హను మాన్” గురించి అందరికీ తెలిసిందే. మరి మన తెలుగు సినిమా నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమా ఇది కాగా చిన్న చినుకులా వచ్చి బాక్సాఫీస్ దగ్గర ప్రళయ తుఫాన్ లాంటి సక్సెస్ ని ఈ చిత్రం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ అప్పుడే పాన్ వరల్డ్ లెవెల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో జపాన్ వెర్షన్ రిలీజ్ కూడా ఒకటి.

అయితే ఇప్పుడు ఫైనల్ గా జపాన్ వెర్షన్ విడుదల పై సాలిడ్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. సోషల్ మీడియాలో హను మాన్ జపాన్ వెర్షన్ ట్రైలర్ వైరల్ గా మారుతుండడంతో దీంతో ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 4న గ్రాండ్ గా విడుదల చేసేందుకు రంగం సిద్దం  చేస్తున్నట్టుగా సమాచారం. మరి అక్కడ ఈ చిత్రం తెలుగు భాషలో జపాన్ సబ్ టైటిల్స్ తో విడుదల కాబోతున్నట్టుగా సమాచారం. మరి ఈ సెన్సేషనల్ సక్సెస్ చిత్రం అక్కడ ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకోబోతుందే వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles