రెడీ అవ్వండి!

Thursday, January 22, 2026

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా సినిమా సరిపోదా శనివారం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు ఓటీటీలోనూ సాలిడ్ రెస్పాన్స్ లభించింది.

అయితే, ఇప్పుడు ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యింది. కానీ, ఈసారి హిందీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సూర్య వస్తున్నట్లు నాని చెప్పాడు. సరిపోదా శనివారం హిందీ టెలివిజన్ ప్రీమియర్‌గా కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్‌లో ప్రసారం అవుతుంది. శనివారం ‘సూర్యాస్ శాటర్డే’ అంటూ హిందీ ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ ఇచ్చేందుకు నాని అండ్ ఎస్.జె.సూర్య సిద్దమవుతున్నారు.

దీంతో ఈ సినిమాను బుల్లితెరపై హిందీ ఆడియెన్స్ ఎంతమేర ఆదరిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సాలిడ్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles