దావుడి స్టెప్పులకు రెడీ అవ్వండి ఇక!

Saturday, December 7, 2024

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మరో అప్డేట్‌ను మూవీ మేకర్స్‌ విడుదల చేశారు. ఇప్పటికే సెన్సేషన్ అయిన రెండు సాంగ్స్‌కు తోడుగా ఇప్పుడు మూడో పాటను కూడా దేవర విడుదలకు రెడీ చేశాడు. ‘దావుడి’ అంటూ సాగే ఈ సాంగ్ విడుదలకి దేవర టైమ్ ఫిక్స్ చేశాడు.

దావుడి వీడియో సాంగ్‌ను సెప్టెంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఎన్టీఆర్‌తో కలిసి జాన్వీ కపూర్ డ్యాన్స్ చేస్తున్న పోజ్ ఈ సాంగ్‌పై అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ మాస్ స్టెప్పులు నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని మూవీ మేకర్స్ ముందే పాటపై భారీ అంచనాలను పెంచేశారు.

మొత్తానికి దేవరోడి మాస్ స్టెప్పులు వీక్షించేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్దంగా ఉన్నారు. ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా గా ఉంది.  ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే సంగీతం ఇస్తుండగా, కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles