అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా గురించి సినీ వర్గాల్లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘విరూపాక్ష’ సినిమాతో ఆకట్టుకున్న కార్తీక్, ఈసారి కూడా అదే స్థాయిలో మిస్టరీతో నిండిన థ్రిల్లర్‌ను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు.
ప్రస్తుతం ‘ఎన్సీ24’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరగుతోంది. సినిమా కోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్ కూడా నిర్మించారు. ఆ స్థాయి తయారీ చూస్తే, ఈ సినిమా విజువల్‌గా ఎంతో గ్రాండ్‌గా ఉండబోతుందనే ఊహలు వ్యక్తమవుతున్నాయి.తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు టైటిల్ ఎంపిక ప్రక్రియ సాగుతున్నట్లు తెలుస్తోంది. ‘వృషకర్మ’ అనే పేరును ఇప్పటికే టీమ్ పరిశీలించగా, మరో రెండు పేర్లను కూడా దర్శకుడు పరిగణనలోకి తీసుకున్నాడని చెబుతున్నారు. అయితే, ఈ రెండు టైటిల్స్ ఏమిటన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.
అడ్వెంచర్, మిస్టరీ అంశాలతో కూడిన ఈ కథకు ఏ టైటిల్ సరిగా సరిపోతుందో అనే ఉత్కంఠ అభిమానుల్లో కొనసాగుతోంది. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది.