ప్రముఖ నటుడు మృతి!

Sunday, February 16, 2025

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ కన్నుమూశారు. చెన్నైలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో విజయ రంగ రాజు గుండెపోటుతో మరణిచినట్లు సమాచారం. వారం క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో విజయ రంగరాజు గాయపడినట్లు తెలుస్తుంది. ట్రీట్మెంట్ కోసం ఆయన చెన్నై వెళ్లి అక్కడే హాస్పిటల్ లో గుండెపోటుతో మరణించారు.

ఆయనకి  ఇద్దరు కూతుళ్లు. ఎక్కువగా విలన్ , సహాయ పాత్రలు పోషించారు. ఆయన అశోక చక్రవర్తి, స్టేట్ రౌడీ భైరవ ద్వీపం వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే యజ్ఞం సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. యజ్ఞం చిత్రంలో హీరోగా గోపీచంద్ నటించగా విలన్ పాత్రలో విజయ రంగరాజు నటించిన సంగతి తెలిసిందే. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా ఆయన నటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles