మలయాళం లో మంచి పేరు సంపాదించిన నటుడు షైన్ టామ్ చాకో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఇటీవల నాని నటించిన దసరా సినిమాలో విలన్ పాత్రలో, అలాగే దేవర, డాకు మహారాజ్, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన కుటుంబానికి సంభందించి ఒక దురదృష్టకరమైన వార్త విన్నాం.
బెంగళూరు-సేలం హైవే రోడ్డుపై షైన్ టామ్ చాకో తన కుటుంబ సభ్యులతో కలసి ప్రయాణిస్తున్నప్పుడు కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన తండ్రి సిపి చాకో తీవ్రంగా గాయపడి దురదృష్టవశాత్తు మృతి చెందారు. షైన్ టామ్ చాకో తల్లి, సోదరుడు, డ్రైవర్ , ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.