రాహు కేతువులు ప్రమాదకరమైన గ్రహాలు. సూర్యచంద్రులను కూడా వారు గ్రహణం పట్టేస్తారు. వారు ఎంత ప్రమాదకరమైన గ్రహాలైనప్పటికీ గ్రహణం పడితే కొద్ది సమయం లేదా కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. కానీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాహు కేతువుల కంటే కూడా ప్రమాదకరమైన గ్రహం. ఒకసారి జగన్ గ్రహణం పడితే ఆ పీడ ఐదేళ్లపాటు ఉంటుంది. అయినా సరే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురోగతికి, అమరావతికి పట్టిన ‘జగన్ గ్రహణం’ విడిచిపోయింది! ఇన్నేళ్ల గ్రహణ బాధలను తట్టుకొని అమరావతికి ఇప్పుడు విముక్తి వస్తున్నది. అక్కడ అసెంబ్లీ, హైకోర్టు అద్భుత భవనాలకు ఆల్రెడీ నిర్మాణ కార్యక్రమాలు శ్రీకారం దిద్దుకోగా.. పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉండే ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణం ఇప్పుడు మొదలు కాబోతోంది.
జగన్ గ్రహణం పట్టి ఉన్న కాలంలో ఐదు టవర్ల కోసం తీసిన పునాదులన్నీ పెద్ద చెరువులో పడ్డట్టుగా తయారయ్యాయి. జగన్ వాటి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. చంద్రబాబు సర్కారు వచ్చాక ఇన్నాళ్ళూ నీటిలో నానిన పునాదుల నాణ్యతను నిపుణులతో మదింపు చేయించిన తర్వాత అక్కడ నీటిని బురదను తొలగించే పనులు చేపట్టారు. ఇప్పుడిప్పుడే ఆ పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఆ ప్రాంతమంతా శుభ్రమైంది పనులకు టెండర్లు పిలవడమే మిగిలి ఉంది.
జగన్ గ్రహణం యొక్క అసలు నష్టం ఇక్కడే కనిపిస్తోంది. 2018 లో అప్పటి చంద్రబాబు సర్కారు టెండర్లు ఆమోదించి పనులు ప్రారంబింపజేసిన అంచనా వ్యాయానికి ఇప్పటి ధరలకు అసలు పొంతనలేదు. స్టీల్ ఇసుక ఇటుక ధరలు భారీగా పెరగడంతో అంచనా వ్యయం ఏకంగా 73% పెరిగింది.
మొత్తం అయిదు ఐకానిక్ టవర్ల నిర్మాణానికి 2018లో 2703 కోట్ల రూపాయల వ్యయంతో టెండర్లు పిలిచారు. ఇప్పుడు పెరిగిన ధరల ప్రకారం అంచనాలు రూపొందించగా అది కాస్తా 4687 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంటే అమరావతి రాజధానికి అయిదేళ్లపాటు ‘జగన్ గ్రహణం’ పట్టడం వలన ఖజానాపై అదనపు భారం సుమారు రెండువేల కోట్ల రూపాయలన్నమాట. అయినా సరే.. ఈ భారాన్ని భరిస్తూ అనుకున్న డిజైన్ల ప్రకారం రాష్ట్రానికే వన్నె తెచ్చే అద్భుత ఐకానిక్ టవర్లను నిర్మించాలని చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తోంది.
ఈ భవనాల్లో.. జీఏడీ టవర్ మాత్రం 47 అంతస్తులు, మిగిలిన నాలుగు టవర్లు 39 అంతస్తుల వంతున ఉంటాయి. ఈఅయిదేళ్లలోగానే ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణం కూడా పూర్తిచేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది.