విజయమ్మ లైవ్ ప్రెస్ మీట్ పెడితే తప్ప నమ్మం!

Thursday, December 5, 2024

వైఎస్పార్ కుటుంబ ఆస్తుల తగాదా ఇప్పుడు బజార్న పడింది. ఆ కుటుంబం పరువు మొత్తం సర్వనాశనం అయింది. అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తుల కోసం పోరు నడుస్తోంది. తల్లికి ఇచ్చిన గిఫ్ట డీడ్ ఆస్తులు కూడా వెనక్కు కావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దావాలు నడుపుతున్నారు. తల్లిని, చెల్లిని తన అనుచరులతో నానా మాటలు అనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. రోడ్డున పడి కొట్టుకోవడం ఒక్కటే తక్కువ.. తతిమ్మా అన్ని రకాలుగానూ వారి మధ్య తగాదా నడుస్తూనేఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ వివాదాలన్నింటికీ అసలు సిసలు సాక్షీభూతంగా ఉండగల, వాస్తవాలను చెప్పగల వైఎస్ విజయమ్మ రెండుసార్లు స్పందించారు. ఒకసారి వైఎస్ఆర్ కుటుంబ అభిమానులకు బహిరంగ లేఖ ద్వారాను, తాజాగా తమ కుటుంబం గురించి సోషల్ మీడియా పోస్టులు, ట్రోలింగు ఆపేయాలని కోరుతున్న వీడియోసందేశం ద్వారాను ఆమె ప్రజల ఎదుటకు వచ్చారు. అయితే వైఎస్ విజయమ్మ స్వయంగా లైవ్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే తప్ప నమ్మలేం అని.. ఆమె ఇతరుల ప్రభావానికి లోనై చెబుతుండవచ్చునని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

వైఎస్ విజయమ్మ తన తాజా వీడియో సందేశంలో కుటుంబ బంధాల గురించి మాట్లాడారు. మొన్నటి బహిరంగ లేఖలో కూతురుకు  కొడుకు అన్యాయం చేస్తున్నాడని.. అందుకే తాను కూతురు పక్షాన ఉన్నానని విజయమ్మ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కుటుంబంలో తగాదాలు ఉన్నంత మాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతాడా? చెల్లికి అన్న కాకుండా పోతాడా? అని సూక్తులు చెబుతున్నారు. మా పిల్లల్ని చాలా సంస్కార వంతంగా పెంచాం అని కూడా ఆమె అంటున్నారు.

అయితే ఆమె వీడియో మాటలు కూడా ఎవరో పనిగట్టుకుని ట్రైనింగు ఇచ్చి మాట్లాడించినట్టుగా ఉన్నాయని పలువురు అనుమానిస్తున్నారు. విజయమ్మ లేఖ తర్వాత.. పులివెందులలో అనేక మంది సొంత బంధువుల ఇళ్లకు వెళ్లి జగన్ రెడ్డి మంతనాలుసాగించిన సంగతి తెలిసిందే. ఎటూ వైవీ సుబ్బారెడ్డి మీద విజయమ్మ నేరుగా విమర్శలు చేసినందున.. ఆయనతో వర్కవుట్ కాదు గనుక.. పులివెందుల లోని బంధువుల ద్వారా రాయబారాలు నడిపినట్టుగా తెలుస్తోంది. అక్కడి బంధువులు విజయమ్మను కలిసి మాట్లాడిన తర్వాత.. ఇలాంటి వీడియో వచ్చిందని అనుకుంటున్నారు.
అసలు వాస్తవాలుబయటకు రావాలంటే.. వైఎస్ విజయమ్మ లైవ్ లో ప్రెస్ మీట్ పెట్టాలని, విలేకరుల ప్రశ్నలకు కూడా జవాబులు ఇవ్వాలని, అప్పటికి గానీ.. కుటుంబంలోని రచ్చలపై క్లారిటీ రాదని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles