దేవరలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా?

Wednesday, September 18, 2024

రెండు మూడు రోజుల నుంచి సోషల్‌ మీడియాలో దేవర సినిమా గురించి, ఎన్టీఆర్‌ గురించి  తెగ హడావిడి చేస్తున్న నాగ వంశీ గురించి ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే దేవర సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు నాగ వంశీ చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు నాగ వంశీ ఈ దేవర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో స్వయంగా విడుదల చేయబోతున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడిస్తూ ఒక అధికారిక ప్రకటన చేశారు.

తారక్ దేవర సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో తన డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లు నాగవంశీ తాజాగా ప్రకటించారు. వీరిద్దరూ కలిసి గతంలో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. గురూజీగా పిలుచుకునే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడమే కాక కలెక్షన్లు వర్షం కూడా కురిపించింది.

ఇప్పుడు దేవర సినిమా కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని నాగ వంశీ గట్టిగా నమ్ముతున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర హక్కులు ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయి అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. అయితే గట్టి రేటే నిర్మాతలు కోట్ చేయగా దానిని నాగ వంశీ దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక దేవర సినిమాకి సంబంధించిన మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles