మీడియా అంటే భయంలో అంతరార్థం ఏమిటి?

Sunday, October 13, 2024

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి చీఫ్ సంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి దేశ రాజధాని న్యూఢిల్లీలో తాము ఏరి కోరి ఆహ్వానించిన జాతీయ మీడియాతో మాత్రమే ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు.  రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో ఢిల్లీలోని ఐదు నక్షత్రాల హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తూ..  సాక్షి మినహా తెలుగు మీడియా సంస్థల ప్రతినిధులు ఎవరినీ  లోనికి అనుమతించలేదు.  ప్రెస్ మీట్ జరుగుతున్నదని తెలిసి అక్కడకు వెళ్లిన..  తెలుగు మీడియా ప్రతినిధులను అడ్డుకోవడానికి,  లోపలకు రాకుండా నియంత్రించడానికి ప్రత్యేకంగా ఒక సిఐడి అధికారిని సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి మరి ఈ చాటుమాటు ప్రెస్ మీట్ నిర్వహించారు.  చంద్రబాబు నాయుడు అవినీతి చేశారని,  అందువల్లనే ప్రస్తుతం జైల్లో ఉన్నారని జాతీయ మీడియా ద్వారా చెప్పడం ఏపీ ప్రభుత్వం లక్ష్యం.  అయితే అలా డప్పు కొట్టి చెప్పదలుచుకున్నప్పుడు తెలుగు మీడియా ప్రతినిధులు ఉండరాదని వారు ఎందుకు అనుకున్నారు? అనేదే ప్రశ్నార్థకం. 

 సిఐడి వ్యవహారసరళి తొలి నుంచి కూడా అనేక విధాలుగా వివాదాస్పదం అవుతూనే ఉంది.  చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసిన క్షణం నుంచి..  ఆయన మీద తాము ఆరోపిస్తున్న నేరాలన్నీ రుజువైపోయినట్లుగానే ప్రచారం చేయడానికి వారు తపన పడుతూ వస్తున్నారు.  మాజీ ముఖ్యమంత్రి స్థాయి కీలక నాయకుడిని ఆగస్టు చేసిన తర్వాత,  సంబంధిత అధికారులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలను వెల్లడించడం అనేది సహజం.  అయితే విజయవాడలో ఒకసారి,  హైదరాబాదులో మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి అవే సంగతులను వెల్లడించడం ద్వారా ఏపీ సిఐడి అధికారులు..  స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు వ్యవహారంలో తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.  అక్కడితో చాలదన్నట్లుగా..  దేశ రాజధాని ఢిల్లీలో మరొక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. 

 తెలుగు మీడియా ప్రతినిధులను పిలిస్తే..  తాము వల్లించే కథనాలకు ఎదురు ప్రశ్నలు ఉంటాయని,  వాటికి జవాబు చెప్పడం సాధ్యం కాదని సిఐడి అధికారులు భయపడ్డారేమో తెలియదు గాని సెలెక్టివ్ మీడియాను మాత్రమే పిలిచారు. సిఐడి అధికారులు ప్రెస్ మీట్ పెట్టడంలో తెలుగు మీడియా పట్ల చూపిస్తున్న ఈ వివక్ష సర్వత్రా విమర్శలకు గురవుతోంది. అరెస్టు చేసిన తర్వాత చట్టం తన పని తాను చేసుకు పోతుందని అధికారులు ఉండాలే తప్ప,  చంద్రబాబు నాయుడు మీద బురద చల్లడమే తమ జీవితాశయం అన్నట్లుగా ఊరూరా  ప్రెస్ మీట్ లు పెడుతూ తిరగడం  రాజకీయ కక్ష సాధింపులో  భాగమేనని ప్రజలు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles