బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో దీపికా పదుకోణ్ పేరు తప్పకుండా ముందుంటుంది. తన అందం, ప్రతిభతో పాటు భారీ సినిమాల్లో నటించి స్టార్ స్థాయిని సంపాదించింది. అయితే బాలీవుడ్‌లో ఎంత స్టార్ అయినా, దక్షిణ భారత సినిమా అవకాశాల విషయంలో మాత్రం ఆమెకు అనుకున్నంతగా అదృష్టం కలిసిరాలేదని చెప్పాలి. కారణం ఆమె కండిషన్స్, ఫీజు, ఇతర షరతులు మన సైడ్ ఫిల్మ్‌మేకర్స్‌కి సెట్ కాకపోవడమే అని ఫిల్మ్ వర్గాల్లో వినిపించే మాట.
ఇక ఇటీవల దీపికా పేరు వివాదాల్లో వినిపించడం కొత్తేమీ కాదు. ‘కల్కి 2898 ఎడి’, ‘స్పిరిట్’ సినిమాల సమయంలో ఆమె చుట్టూ ఉన్న వివాదాలు ఇప్పటికీ చర్చల్లో ఉన్నాయి. ఆ విషయాలు ఇంకా పూర్తిగా చల్లారకముందే ఇప్పుడు మరో కొత్త కారణంతో దీపికా మళ్లీ వార్తల్లోకి వచ్చారు.
తాజాగా ఆమె భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి అబుదాబి టూరిజం ప్రమోషన్ కోసం వెళ్లారు. అక్కడ ఆమె వేసుకున్న సంప్రదాయ దుస్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
