మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో పూర్తి కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త పలు చోట్ల వినిపిస్తోంది. చిరంజీవి ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని చెప్తున్నారు. అందులో ఒక పాత్ర పాత చిరంజీవి తరహా ఉంటుంది, అది వింటేజ్ స్టైల్‌కి సంబంధించినది. మరొక పాత్ర మాత్రం యాక్షన్ మూమెంట్స్‌తో నిండి ఉంటుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, నయనతారతో కలిసి కుటుంబ నేపథ్యం ఉన్న సీన్స్‌పై షూటింగ్ చేస్తున్నారు. ఈ భాగాల్లో చిరంజీవి, నయనతార మధ్య ఉన్న కామెడీ సన్నివేశాలు చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటాయని తెలుస్తోంది.
తన తాజా ఇంటర్వ్యూలో మెగాస్టార్ ఈ సినిమా కథను తనకు చాలా నచ్చిందని, అనిల్ రావిపూడి చెప్పే సీన్స్‌కి నవ్వుకుంటూ ఉంటానని చెప్పారు. ఆయన చెప్పే ప్రతి సన్నివేశం చాలా వినోదాత్మకంగా ఉంటుందని, ప్రేక్షకులకు ఇది ఎంతో ఇష్టమవుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు కూడా తెలిసింది.