పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు ఎప్పటినుంచో ప్రేక్షకులలో భారీ ఆసక్తిని కలిగిస్తోంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ తో పాటు జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్నారు. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఈ సినిమా చివరికి రిలీజ్ దశకు చేరింది.
ఇప్పుడు అందరి దృష్టి సినిమా విడుదల తేదీపై ఉంది. తాజా సమాచారం ప్రకారం, హరిహర వీరమల్లు చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయాలని టీం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుందని సమాచారం. వచ్చే సోమవారం ప్రెస్ మీట్ ద్వారా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.
సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరిన్ని ప్రమోషనల్ అప్డేట్స్ మేకర్స్ నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఇంతకాలంగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకురాబోతుందని అభిమానులు సంతోషంగా భావిస్తున్నారు. ఇకపోతే ప్రమోషన్ కార్యక్రమాలు వేగంగా జరగనున్నట్లు తెలుస్తోంది.