మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు విశ్వంభర అనే భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత మరిన్ని సాలిడ్ ప్రాజెక్టులు చిరు చేయనున్నారు. అయితే మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వింటేజ్ సినిమాల్లో అయితే చిరు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది.
అలాగే ఆఫ్ లైన్ లో కూడా పలు ఈవెంట్స్ లేదా ఫంక్షన్స్ లో కూడా ఇప్పటికీ చిరు తన మార్క్ టైమింగ్ చూపించి నవ్విస్తారు. మరి ఇలా తాజాగా నాచురల్ స్టార్ నానితో కూడా జరిగిన ఓ ఇన్సిడెంట్ ఇపుడు వైరల్ అవుతుంది.నాగ చైతన్య పెళ్లిలో జరిగిన సంఘటనని నాని షేర్ చేసుకున్నాడు. తను వస్తున్నప్పుడు చిరంజీవి గారు ఎదురుగా ఉన్నారు అని అప్పుడు తనను ప్రొడ్యూసర్ గారూ.. అంటూ పలకిరించారు అంటూ నాని తెలిపాడు.
తను వేరే ఎవరినో అంటున్నారేమో అని వెనక్కి తిరిగి చూసాను కానీ అలా నన్నే అంటున్నారు అంటూ మంచి ఫన్ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నారు. అయితే నాని నిర్మాతగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబో లో భారీ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. సో అలా చిరు నానీని తన ప్రొడ్యూసర్ గారూ అంటూ చమత్కరించారు అని చెప్పవచ్చు. ఏమైనా కానీ మెగాస్టార్ నుంచి ఈ రేంజ్ కామెడీ టైమింగ్ మాత్రం ఈ మధ్య సినిమాల్లో బాగా మిస్సవుతుంది అని చెప్పాలి.