జైల్లో చంద్రబాబును మరింత టార్గెట్ చేస్తున్నారా?

Monday, October 14, 2024

చంద్రబాబును జైల్లో వేయడం అనేది రాజకీయ వేధింపులు, , కక్ష సాధింపులో భాగం కానే కాదని అంటారు.  ఆయన నేరం చేశాడని..  దానికి సంబంధించి సాక్ష్యాధారాలు అన్నీ  సమగ్రంగా ఉన్నాయని చెబుతారు.  చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటారు.  ఇవన్నీ అధికార పార్టీ నాయకులు మీడియా ముందుకు వస్తే మాట్లాడే మాటలు. వ్యవహారంలో గమనించినప్పుడు.. చంద్రబాబు నాయుడును జైల్లో వేయడం మాత్రమే కాదు కదా,  అంతకుమించి ఆయనను అడుగడుగునా వేధించడానికి..  రాజకీయంగా కక్ష సాధించడానికి తెగబడుతున్నారని అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.  రాజమండ్రి జైలు  సూపరింటెండెంటు..  హఠాత్తుగా సెలవు మీద వెళ్లడం,  ఆయన స్థానంలో వైసీపీ నాయకులతో బంధుత్వాలు సన్నిహిత సంబంధాలు..  వారికి అనుకూలంగా అడ్డగోలుగా వ్యవహరిస్తారని అపకీర్తి పుష్కలంగా కలిగి ఉన్న వేరే అధికారిని ఇన్చార్జి గారిని నియమించడం ఈ పరిణామాలన్నీ ప్రజలకు ఇలాంటి అనుమానాలను కలిగిస్తున్నాయి.

 చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టిన తర్వాత..  ఒకటి రెండు రోజులు పరిస్థితులు అంతా సవ్యంగానే గడిచినట్లు అనిపించాయి.  ఈలోగా జైలు సూపరింటెండెంట్ హఠాత్తుగా సెలవు పై వెళ్ళారు. చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండే అధికారి అని ఆయనపై ముద్ర ఉండేది.  ఆయన స్థానంలో ముదపురెడ్డి రవి కిరణ్  ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు.  ఆయన కోస్తాంధ్ర రీజియన్ శాఖకు డిఐజి కూడా.  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సమీప బంధువు! గతంలో జైళ్ళ శాఖ కడప రేంజ్ డీఐజీ గా ఉన్నప్పుడు.. కడప సెంట్రల్ జైల్లో వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులైన దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి తదితరులకు రాచ మర్యాదలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

 రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ స్థాయి కంటే పై హోదాలో ఉన్న డిఐజి రవికిరణ్ ను ఇన్చార్జిగా నియమించడం అంటేనే..  అది చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడం కోసమే అనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.  పైగా ఆయన బాధ్యతలు తీసుకోగానే చంద్రబాబును కలిసేందుకు భార్య భువనేశ్వరికి ములాఖత్ తిరస్కరించడం కూడా చర్చనీయాంశం అవుతోంది.  అసలే జైలులో చంద్రబాబు నాయుడుకు భద్రత లేదని,  ప్రాణాపాయం ఉన్నదని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో..  అధికార పార్టీకి అనుకూలుడైన  అధికారిని కీలక స్థానంలో నియమించడం పలువురి భయాలకు కారణం అవుతోంది. చంద్రబాబును మానసికంగా కుంగతీసేందుకు,  ముందు ముందు ఆయనతో ములాఖత్ లను నియంత్రించేందుకు రవి కిరణ్ ను ఈ కీలకస్థానంలో పెట్టారని విమర్శలు వస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles