తండేల్‌ సినిమా గురించి చైతూ ఆసక్తికర వ్యాఖ్యలు!

Wednesday, September 18, 2024

టాలెంటెడ్ డైరెక్టర్‌ చందూ మొండేటి డైరెక్షన్‌ లో నాగ చైతన్య నటిస్తున్నతరువాత చిత్రం తండేల్‌. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌ గా చేస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా చైతూ ఈ సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో దేశభక్తి కూడా ఉంది. పాక్ జలాల్లోకి వెళ్లి దాదాపు రెండేళ్లు జైల్లో ఉండి భారత్‌కు తిరిగి వచ్చిన రాజు నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపు దిద్దుకుంటుందని  నాగ చైతన్య తెలిపారు.

ఈ పాత్ర కోసం తొమ్మిది నెలలు చైతూ వర్క్ చేసినట్లు తెలిపారు. ఇది చాలా స్ఫూర్తిదాయకమైన కథ. నేను ప్రతిదీ సరిగ్గా ఉండాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా శ్రీకాకుళం యాస. నేను రాజు ఇంటికి వెళ్ళాను, అతని ధైర్యం, సంకల్పం నన్ను ఆశ్చర్య పరిచింది. మత్స్యకారుల కష్టాలను అర్థం చేసుకోవడానికి నేను వారితో సమయం గడిపాను. నా కెరీర్ లో ఈ సినిమా చాలా ముఖ్యమని చైతూ తెలిపారు.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2024న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles