చెల్లెమ్మకు జవాబు చెప్పగలవా జగనన్నా!

Thursday, March 20, 2025

తాను ఏం చేస్తే అది మాత్రమే ప్రజల తరఫున పోరాడడం అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కళ్లు మూసుకుని పాలు తాగుతూ.. తనను ఎవరూ గమనినంచడం లేదు అనుకునే పిల్లి లాగా, జగన్మోహన్ రెడ్డి.. తన లోపాలను ఎవ్వరూ గుర్తించడం లేదనే భ్రమలోనే బతుకుతుంటారు. కానీ జగన్ ప్రవర్తన తీరును ఎండగట్టడానికి, ఎప్పటికప్పుడు ఆయన తీరును తూర్పారపట్టడానికి ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఒక్కటీ చాలు! జగన్ ఒకవైపు మిర్చి యార్డుకు వెళ్లి రైతుల వద్ద కాసేపు నానా యాగీచేసి, వంశీ ఉన్న జైలు వద్దకు వెళ్లి.. పోలీసుల మీద ఆగ్రహావేశాలు కురిపించడం చేసేశారు. అంతే తన వైపు నుంచి అది చాలు.. ప్రజలకోసం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు.. అనుకోవడం జగన్ అలవాటు! అయితే జగన్ తీరును ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఎండగడుతున్నారు.

కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడానికి వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ములేదని షర్మిల అంటున్నారు.  నేరస్తులను, దౌర్జన్యం చేసిన వాళ్లను జైలుకు వెళ్లి పరామర్శించడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ కు టైం ఉంటుంది గానీ.. ప్రజలకోసం అసెంబ్లీకి వెళ్లి సమస్యలను ప్రస్తావించడానికి మాత్రం సమయం ఉండదని ఆమె ఎద్దేవా చేస్తున్నారు. జగన్ కు అసెంబ్లీకి వెళ్లేందుకు మొహం చెల్లడం లేదని అంటున్నారు.

11 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించినప్పటికీ.. శాసనసభకు వెళ్లకుండా జగన్ మారాం చేస్తున్నారని అంటున్న వైఎస్ షర్మిల, అసలు వైసీపీ వారికి, జగన్ కు ప్రజల మధ్య తిరిగే అర్హతే లేదని అంటున్నారు. ఈసారి కూడా అసెంబ్లీ వెళ్లే దమ్మూ ధైర్యం ఆ పార్టీకి లేకపోతే గనుక..  వారందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్లమీద యాగీ చేయడం నానారకాలుగా ఆయన తీరును అపహాస్యం పాలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం మిర్చి ధరలు పడిపోయి ఉన్న నేపథ్యంలో.. జగన్ దళాలు.. అసెంబ్లీకి వెళ్లి.. ధరల విషయంలో ప్రభుత్వ సాయం డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశ పెట్టవచ్చునని, కేంద్రం ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఒక తీర్మానం ప్రవేశపెట్టవచ్చునని.. కనీసం మిర్చి రైతుల కోసం కేవలం మాటలు చెప్పడం మాత్రమే కాకుండా.. నిర్దిష్టమైన ఒక ప్రయత్నం చేసినట్టుగా ఉంటుందని… ప్రజలు అంటున్నారు.

కేంద్రం మీద ఇప్పటికే చంద్రబాబునాయుడు ఒత్తిడి తెస్తున్నారు. కేంద్ర మంత్రులకు లేఖల మీద లేఖలు రాస్తున్నారు. చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన కూడా పెట్టుకున్నారు. వ్యవసాయమంత్రిని కలిసి మిర్చి రైతుకు మద్దతుగా నిలవడం గురించి మాట్లాడబోతున్నారు. అలాంటిది.. జగన్ క నీసం అసెంబ్లీకి వెళ్లి మిర్చి రైతుల గోడు వినిపించలేరా? అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles