భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్..ఆ స్టార్‌ హీరో సినిమాలో ఛాన్స్‌!

Sunday, December 8, 2024

మిస్టర్‌ బచ్చన్‌ సినిమా విడుదలకు ముందే భాగ్యశ్రీ బోర్సే పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మారు మోగిపోయింది. భాగ్యశ్రీ అందాలు, డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. థియేటర్లో మిస్టర్‌ బచ్చన్‌ నిరాశపర్చినా.. అమ్మడికి మాత్రం ఫుల్ క్రేజ్‌వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ల లిస్ట్‌లో భాగ్యశ్రీ ముందు వరుసలో ఉన్నారు.

టాలీవుడ్‌లో ఇప్పటికే ఓ సినిమా చేస్తున్న భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.గౌతమ్‌ తిన్ననూరి, విజయ్‌ దేవరకొండ కాంబోలో ‘వీడీ 12’ (వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌ సరసన భాగ్యశ్రీ బోర్సే కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ శ్రీలంకలో జరుపుకుంటుంది.

ఇక స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ సినిమాకు కూడా భాగ్యశ్రీ తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంట. దుల్కర్‌ సినిమా కోసం దర్శకుడు రవి నాయికగా భాగ్యశ్రీని ఎంచుకున్నట్లు సమాచారం. డైరెక్టర్ రవి కథ వినిపించగా ఆమె ఓకే చెప్పారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.2023లో ‘యారియాన్ 2’ హిందీ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

మొదటి సినిమాతోనే ఆమె మంచి హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల కార్తీక్ ఆర్యన్ నటించిన ‘చందు ఛాంపియన్‌’తో మరో హిట్ కూడా అందుకుంది. అందం, అభినయం ఉన్న భాగ్యశ్రీ సినీ ఇండస్ట్రీని ఏలుతుందడనంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles