ప్రభాస్‌ గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన బాలీవుడ్‌ భామ!

Wednesday, September 18, 2024

కల్కి 2898 ఏడీ సినిమా భారతీయ సినిమా రికార్డులను తిరగరాసేందుకు సిద్దమవుతంది. ఈ సినిమా  ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న విషయం తెలిసిందే.  మూవీలో చాలా మంది నటులు కీలక పాత్రల్లో కనిపించబోతుండగా.. ప్రమోషన్స్ ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ టార్గెట్ గా జరుగుతున్నట్లు అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ బుజ్జిని డ్రైవ్ చేయమని ఏకంగా ఎలన్ మస్క్ కు ట్వీట్ చేశాడు.

ఎలాన్ మాస్క్‌ కానీ  రియాక్ట్ అయితే సినిమా ఈజీగా ప్రమోట్ అవుతుందనే ఐడియా వేసాడు. ఇక బుజ్జి ఇంట్రడక్షన్ కు ఏకంగా ప్రభాస్ ప్రేమ, పెళ్లినే వాడేశాడు. నెట్టింట దుమారం రేపాడు.ఇదిలా అంటే ప్రభాస్ సరసన దీపికా పదుకునేతో పాటు దిశా పఠాని కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పటి వరకు నటించిన వ్యక్తుల్లో ప్రభాస్‌ నైసెస్ట్ అని కంప్లిమెంట్ ఇచ్చింది. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాడని.. అసలు స్టార్ అనే అహంకారం లేకుండా సాదా సీదాగా ఉంటాడని చెప్పుకొచ్చింది. ఫస్ట్ డే షూటింగ్ రోజు తనతో పాటు సెట్ లో ఉన్న అందరికీ బ్రేక్ ఫాస్ట్, భోజనం తెప్పించడం ఇంకా గుర్తుందని చెప్పింది. అసలు ఆయన ఉంటే భోజనానికి ఎలాంటి ఢోకా ఉండదని ఈ ముద్దుగుమ్మ మురిసిపోతూ చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles