పవన్ కళ్యాణ్ నటిస్తున్న “హరిహర వీరమల్లు” సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు మంచి శుభవార్త ఒకటి అందింది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎట్టకేలకి విడుదల దశకి చేరుకుంటున్నట్లు తెలుస్తుంది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండగా, సినిమా చుట్టూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ప్లాన్లు ఇప్పట్నించే మొదలైయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా విడుదలపై ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. జూన్ 12 న రాత్రి 12 గంటల నుంచి స్పెషల్ షోస్ పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, ఆ షోస్ కోసం టికెట్ ధరలు కూడా మామూలుగా ఉండకపోవచ్చని, కొన్ని చోట్ల వేల రూపాయల వరకూ ధరలు ఉండబోతున్నాయని చెప్పుకుంటున్నారు.
అయితే ఈ స్పెషల్ షోస్ విషయం ఏపీలో మాత్రమేనని, తెలంగాణలో అలాంటి ప్రత్యేక ప్రదర్శనలు ఉండబోవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. నిజంగా ఈ టాక్ నిజమైతే, పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది ఒక స్పెషల్ ట్రీట్ అని చెప్పొచ్చు.