నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ సీక్వెల్‌పై ఫ్యాన్స్‌లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్‌కి పండగే. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న అఖండ 2 సినిమా ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా అని అభిమానులు గట్టి దృష్టిపెట్టారు.
ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడే టైమ్ వచ్చింది. అఖండ 2 నుంచి ఫస్ట్ మేజర్ అప్‌డేట్ రాబోతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. జూన్ 8వ తేదీ ఉదయం 10:54 గంటలకు ఈ బిగ్ అప్డేట్ బయటికి రానుంది. దాంతో సినిమాపై హైప్ ఇంకాస్త పెరిగిపోయింది.
ఈసారి బాలయ్య తన యాక్షన్ అండ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మరోసారి అఖండ రూపంలో తాండవం చేయబోతున్నారని టాక్. ప్రగ్యా జైస్వాల్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి స్టైల్‌లో ఈ సీక్వెల్ కూడా సెట్ అవుతున్నట్టు తెలిసింది.
మొత్తానికి, అఖండ మాస్ ఊపు మళ్లీ మొదలవబోతోంది. జూన్ 8న రానున్న అప్డేట్‌కి బాలయ్య అభిమానులు ఎగబడి ఎదురు చూస్తున్నారు.