నందమూరి బాలకృష్ణ నటిస్తున్న “అఖండ 2” సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ తోనే సినిమాపై క్రేజ్ మరింత పెరిగిపోయింది. మాస్ అవతారంలో బాలయ్య మరోసారి అలరించనున్నారని ఆ టీజర్ స్పష్టంగా చూపించింది.
ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న బాలయ్య, సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక సందర్బాల్లో కనిపిస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌తో కలిసి బాలకృష్ణ కనిపించిన ఒక ఫోటో నెట్టింట వైరల్ అయింది. బాబీ డియోల్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న “హరిహర వీరమల్లు” సినిమాలో ఔరంగజేబ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
ఈ ఇద్దరూ కలిసి హాయిగా నవ్వుతూ దిగిన ఫోటో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు బాలయ్య “అఖండ 2”తో వస్తుండగా, మరోవైపు బాబీ డియోల్ భారీ లుక్‌తో “హరిహర వీరమల్లు”లో కనిపించనున్నాడు. ఇద్దరి సినిమాలు కూడా పాన్ ఇండియా రిలీజ్ కోసం సిద్ధం అవుతుండటంతో, ఈ లెక్కన ప్రేక్షకులకు మాస్ ఫెస్టివల్ వచ్చేనెలల్లో ఖచ్చితంగా దక్కనుంది.