తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న మరో కన్నడ బ్యూటీ!

Sunday, December 8, 2024

రష్మిక మందన్న, పూజ హెగ్డే, కృతి శెట్టి, నేహా శెట్టి, నభ నటేష్, శ్రద్ధ శ్రీనాథ్ ఇంకా చాలామంది కన్నడ నటీమణులు తెలుగులో ఆరంగేట్రం చేసి తమ సత్తా చూపిస్తున్నారు. వీరిలో  రష్మిక , పూజ హెగ్డే లు అయితే బాలీవుడ్ఇ లో కూడా ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ చూపిస్తున్నారు.  

ఇదే వరసలో ఇప్పుడు ఇంకొక కన్నడ భామ టాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతోంది అని వినిపిస్తోంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు కన్నడలో తన అందాలతో అందరినీ ఆకర్షిస్తున్న కన్నడ బ్యూటీ సంపద. ఈమె ‘మిథున రాశి’ అనే కన్నడ సీరియల్ తో ఎంతో సంచలనం అయింది. సంపద అంటే తెలియని వారు లేరు.  22 ఏళ్ళ ఈ భామ మోడల్ కూడాను, అలాగే కన్నడంలో సినిమాలు కూడా చేస్తోంది అని వినికిడి.

ఇప్పుడు ఈ కన్నడ బ్యూటీ తెలుగులో ఇవ్వబోతుందని కూడా  తెలుస్తోంది. ఇంతకీ ఈ భామ ఎవరితో చేయబోతుంది అనుకుంటున్నారా?  నటుడు సందీప్ కిషన్ పక్కన…  రాబోయే సినిమాలో సంపదని తీసుకోవాలని చిత్ర బృందం అనుకున్నట్లు సమాచారం. సందీప్ కిషన్ తో దర్శకుడు నక్కిన త్రినాథ రావుతో అధికారికంగా ఒక సినిమా ని ప్రకటించారు.

 ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది అని, అందుకోసమని కథానాయికగా ఈ కన్నడ బ్యూటీ సంపద ని హైదరాబాదు తీసుకువస్తున్నట్టుగా వినికిడి. సంపద చాలా అందంగా, చక్కగా సందీప్ కిషన్ ని బాగా సూట్ అవుతుందని కూడా నిర్వాహకులు అనుకుంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles