విడాకులు తీసుకున్న మరో స్టార్ కపుల్‌!

Saturday, December 7, 2024

మరో స్టార్ కపుల్ విడాకుల బాట పట్టారు. ఇటీవల తమిళ నటుడు ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య విడాకులు తీసుకుని విడివిడిగా ప్రయాణం మొదలు పెట్టారు. తాగాజా కోలీవుడ్ స్టార్ట్ హీరో జయం రవి, సతీమణి ఆర్తి విడాకులు తీసుకున్నారు. ఎప్పటినుండో వీరి విడాకులపై రూమర్స్ వస్తుండగా నేడు  అధికారకంగా ఓ లేఖను అభిమానుల కోసం వారు విడుదల చేశారు.

ఆ లేఖలో  ” జీవితం అనేది వివిధ అధ్యాయాలతో కూడిన ప్రయాణం, నా సినీ ప్రయాణంలో నా అభిమానులు నాకు ఎంతో మద్దతు ఇచ్చారు, ఇప్పుడు నా జీవితంలోని  ఒక ముఖ్యమైన విషయాన్ని వారితో పంచుకోబోతున్నాను.అనేక సమాలోచనలు,   చర్చల తర్వాత, ఆర్తితో నా వివాహాన్ని రద్దు చేసుకోవాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం తొందరపాటుతో తీసుకోలేదు.  ఈ క్లిష్ట సమయంలో మా గోప్యతతో పాటు మా కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించవలసిందిగా మీ అందరినీ వేడుకుంటున్నాను.

ఈ విషయంలో ఎలాంటి ఆరోపణలు చేయవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని సంవత్సరాలుగా మీరు నాపై కురిపించిన ప్రేమకు నేను కృతజ్ఞుడను” అని జయం రవి సోషల్‌ మీడియా వేదికగా రాసుకొచ్చారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles