యూనివర్సల్ హీరోగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్, మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న భారీ సినిమా ‘థగ్ లైఫ్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా లో కమల్ హాసన్ తో పాటు త్రిష, శింబు తదితర టాలెంటెడ్ నటులు కూడా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో ఉందో ఇప్పటికే ప్రచారాలు చెబుతున్నాయి.
ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ చూస్తే సరైన గమ్యం ఏమిటో, సినిమా కథ ఏ దిశగా సాగుతుందో స్పష్టత రాలేదు. అందుకే సినిమా కథ, ఇతివృత్తం గురించి క్లారిటీ రావాలంటే ట్రైలర్ మాత్రమే దారి చూపించగలదు. ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మే 17 న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఒకే సమయంలో అన్ని భాషల్లో కూడా ఈ ట్రైలర్ రిలీజ్ కాబోతుండటంతో ఈ వేళకి ప్రేక్షకుల దృష్టి మొత్తం ఈ ట్రైలర్ మీదే కేంద్రీకరించబోతోంది.
ఈ సినిమాకు సంగీతం అందించేది ఏ ఆర్ రెహమాన్ కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. నిర్మాణ బాధ్యతలు రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ మరియు మద్రాస్ టాకీస్ కలిసి తీసుకున్నారు. జూన్ 5న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.
అన్ని రకాల ప్రేక్షకులకు కలిపేలా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ట్రైలర్ చూశాకే కొంత స్పష్టత వస్తుందని చెప్పాలి.