బ్రహ్మానందంతో ఐశ్వర్య సెల్ఫీ!

Sunday, October 13, 2024

దుబాయ్‌లో IIFA 2024 అవార్డుల వేడుక ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఇండియన్ సినీ పరిశ్రమకు చెందిన పలువురు హేమాహేమీలు కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఇక సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన పలు భాషలకు సంబంధించిన సినిమాలు ఈ అవార్డుల వేడుకలో విజేతలుగా నిలిచాయి.

ఈ క్రమంలో చాలా మంది సెలెబ్రిటీలు ఒకేచోట కనిపించడంతో పండుగ వాతావరణం ఏర్పడింది. అయితే, ఈ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ఈ ఈవెంట్‌కి వచ్చారు. కాగా, ఈ సినీ అవార్డ్స్ వేడుకలో టాలీవుడ్ సీనియర్ కమెడియన్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా హాజరుకావడంతో, ఆయనతో కలిసి ఐశ్వర్య ఓ సెల్ఫీ దిగింది.

తన కూతురు ఆరాధ్యతో కలిసి బ్రహ్మానందంతో సెల్ఫీ దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరు స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు కూడా ఫుల్‌ ఖుషీగా ఉన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles