ఆయ్‌ పెద్ద హిట్ అవ్వాలి: యంగ్‌ హీరో!

Wednesday, September 18, 2024

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌, నయన్ సారికలు హీరో హీరోయిన్లు గా జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో అల్లు అరవింద్‌ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా ఆయ్‌. ఈ సినిమాని బననీ వాస్‌, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా చేస్తున్నారు. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర డైరెక్షన్‌  వహించారు. ఆగస్ట్ 15న ఈ సినిమాని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్, హీరోయిన్ శ్రీలీల ముఖ్య అతిథులుగా విచ్చేసి బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌ మాట్లాడుతూ.. “స్వయంభు షూటింగ్ వల్ల బయటకు రాలేకపోతోన్నాను. సోషల్ మీడియాలో ఆయ్ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్డు మీదే ఫుడ్ తింటూ నితిన్ గారు ప్రమోట్ చేశారు. ఓ మంచి సినిమా, యంగ్ టీం ముందుకు వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడకు వచ్చాను. జాతి రత్నాలు, మ్యాడ్, బేబీ మూవీ మేకర్లు కూడా ఇక్కడకు వచ్చారు.

చిన్న చిత్రం కూడా వంద కోట్లు కొల్లగొట్టొచ్చని నిరూపించారు. ఆయ్ కూడా ఆ కోవలోనే బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యాడ్ తరువాత నితిన్‌కు మళ్లీ మంచి చిత్రం పడింది. కసిరాజు, అంకిత్, సారికల మ్యాజిక్ చూడాలని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 15న చిత్రం రాబోతోంది. అందరూ చూడండి” అని నిఖిల్ చెప్పుకొచ్చాడు.

ఆ తరువాత యంగ్‌ బ్యూటీ శ్రీలీల మాట్లాడుతూ…“నితిన్ మ్యాడ్ సినిమా అంటే  నాకుఎంతో ఇష్టం. ఆయ్ సినిమాలో హ్యూమర్ చాలా ఉందని అర్థం అవుతోంది. నాకు ఇలాంటి చిత్రాలు అంటే చాలా ఇష్టం. అందుకే అనుదీప్ గారితో నెక్ట్స్ సినిమా ఎప్పుడు అని అడుగుతుంటాను. గోదావరి ప్రాంతమన్నా, ఆ యాస యాస అన్నా నాకు చాలా ఇష్టం. ఆగస్ట్ 15న అందరూ అన్ని చిత్రాలను చూడండి” అని కోరారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles