మొదటి సారి అలాంటి పాత్రలో నటిస్తున్న!

Monday, December 9, 2024

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కాంబోలో మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కల్కి 2898 ఏడీ. ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్లు దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు.

సినిమా విడుదల దగ్గర కాబోతున్న నేపథ్యంలో ఇందులో ముఖ్య పాత్రలన్నింటిని కూడా చిత్ర బృందం ఒక్కొక్కటిగా పరిచయం చేస్తుంది.
సినిమా విడుదలకు  ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో.. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంతే కాకుండా బుకింగ్ ఓపెన్ అయిన కొన్ని నిమిషాలకే చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ కూడా అయిపోయాయి.ఇక విడుదల సమయం దగ్గరపడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో జోరు పెంచింది.

ఈక్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించారు. అంతే కాకుండా.. ప్రమోషన్స్‌లో భాగంగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, ప్రియాంక దత్, స్వప్న దత్‌లు కలిసి ఓ స్పెషల్ చిట్ చాట్ వీడియో ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ మాట్లాడుతూ.. ‘‘బాహుబలి’ తర్వాత మళ్లీ కామెడీ ఈ సినిమాలోనే చేస్తున్నాను. అలాగే ఈ మూవీలో నేను చేసిన భైరవ పాత్రలో కొంచెం నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. మొదటిసారి నేను ఇలాంటి పాత్ర చేస్తున్నాను. ఇది నా కెరీర్‌లోనే దీ బెస్ట్’ అంటూ చెప్పాడు. ప్రస్తుతం ప్రభాస్ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. మూవీపై మరింత హైప్ పెరిగింది అంటూ కామెంట్లు వస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles