నా పై ట్రోల్స్ బాధపెట్టాయంటున్న యంగ్‌ హీరోయిన్‌!

Saturday, December 7, 2024

లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా “ఇండియన్ 2”  గురించి అందరికీ తెలిసిందే. మరి తెలుగులో “భారతీయుడు 2” గా వచ్చిన ఈ సినిమా ఏ భాషలో కూడా అనుకున్న రీతిలో విజయాన్ని అందుకోలేదు. అయితే ఈ సినిమాలో నటించిన ప్రధాన తారాగణంలో హీరో సిద్ధార్థ్ తో ఫ్రెండ్ గా కనిపించిన యువ నటి ప్రియా భవాని శంకర్ కూడా ఒకరు.

అయితే ఈ సినిమా గురించి ఆమెపై చాలానే ట్రోల్స్వచ్చాయి. దీంతో ఆమె ఎమోషనల్ అయ్యింది. కచ్చితంగా తనపై వచ్చిన ట్రోల్స్ వల్ల నేను బాధ పడ్డాను అని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపింది. ఏ నటి అయినా కూడా శంకర్, కమల్ సర్ లాంటి వారి సినిమాలో ఆఫర్ ని ఎలా వదులుకోవాలని అనుకుంటుంది. నా వల్ల డిస్పాయింట్‌ అయిన ఆడియెన్స్ కి మాత్రం తాను క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఆమె తెలిపింది. దీంతో ప్రియా భవాని శంకర్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణ బాధ్యతలు వహించిన సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles