బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కి, స్టార్ హీరో షాహిద్ కపూర్ కి ఒకప్పుడు ఘాడమైన ప్రేమ కథ నడిచింది. అప్పట్లో ఈ ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. దానికి తోడు, వారు కలిసి నటించిన ‘జబ్ వి మెట్’ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. కానీ, ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ విభేదాల కారణంగా ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక బ్రేకప్ తర్వాత కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. అదేవిధంగా, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పూర్ ను పెళ్లి చేసుకున్నాడు.
ఐతే, చాలా గ్యాప్ తర్వాత IIFA వేడుక విలేకరుల సమావేశంలో కరీనా కపూర్ - షాహిద్ కపూర్ మళ్ళీ కలుసుకున్నారు. ఓన్లీ కలుసుకోవడం మాత్రమే కాదు, ఒకర్ని ఒకరు చూసుకున్నాక, వారిద్దరూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. దీంతో, వీరిద్దరినీ కలిసి చూడటం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇటు సోషల్ మీడియాలో కూడా అందరి కళ్ళు వీరిద్దరి పైనే పడ్డాయి. ఈ మాజీ ప్రేమికులు ఇలా కౌగిలించుకోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.