ప్రభాస్‌ తో మాస్‌ సాంగ్‌ లీక్‌ చేసిన ముద్దుగుమ్మ!

Friday, July 11, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్ ఇప్పుడు మంచి బజ్ తెచ్చుకుంటోంది. మారుతీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి డార్లింగ్ అభిమానుల్లో మంచి హైప్ కనిపిస్తోంది. అంచనాలకు పూర్తి భిన్నంగా కనిపించిన టీజర్‌తో సినిమాపై నమ్మకం మరింత పెరిగిపోయింది.

ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. చివరి దశ పనులతో సినిమా రేపట్లో అన్నట్టుగా నిలుస్తోంది. ఇక కథలో మరో హైలైట్ ఏంటంటే, ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు హీరోయిన్స్ కనిపించనున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇందులో మాళవిక మోహనన్ కోసం ప్రత్యేకంగా ఒక మాస్ సాంగ్ ప్లాన్ చేసినట్టు తాజాగా తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారానే ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. సోషల్ మీడియాలో జరిగిన ఇంటరాక్షన్‌లో మాళవిక ఈ విషయాన్ని స్వయంగా తెలిపింది. తనకు ప్రభాస్‌తో కలిసి థమన్ సంగీతంలో ఓ ఎంటర్‌టైనింగ్ మాస్ నెంబర్ ఉన్నట్టు చెప్పడంతో ఆ అప్‌డేట్ ఇప్పుడు ఫ్యాన్స్‌కి ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాని డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధంగా చేస్తున్నారు. అభిమానులకు డిఫరెంట్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్రబృందం అన్ని అంగాలు జాగ్రత్తగా ప్లాన్ చేస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles