హిందూ ఆలయంలో అమలాపాల్ ఓవరాక్షన్!

Tuesday, April 16, 2024

ఏదో ఒక రకంగా వార్తల్లో వ్యక్తిగా నిలవకపోతే సెలబ్రిటీలకు అస్తిత్వ సమస్య ఉంటుంది. వార్తల్లో కనిపించకపోతే ప్రజలు తమను మరచిపోతారని వారికి భయం. కేవలం అదొక్కటే కాకపోవచ్చు గానీ.. ప్రస్తుతం సినిమాల్లో అంత బిజీగా లేని హీరోయిన్ అమలాపాల్ హిందూ ఆలయానికి సంబంధించి ఒక కొత్త వివాదంలో ఇప్పుడు భాగం అయింది.కేరళలోని ఒక హిందూ ఆలయంలోకి, ఆలయ నిబంధనల ప్రకారం క్రిస్టియన్ అయిన ఆమెను రానివ్వకుండా ఆపినందుకు ఆమె విచారం వ్యక్తం చేసింది. వివరాలిలా ఉన్నాయి.
కేరళలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయానికి అమలాపాల్ వెళ్లింది. అయితే ఆమె క్రిస్టియన్ కావడంతో ఆలయ ప్రవేశం వీలుకాదని, దైవదర్శనం కుదరదని అధికారులు తేల్చిచెప్పారు. ఆగ్రహించిన అమలాపాల్.. ఆలయం విజిటర్స్ రిజిస్టర్ లో ఒక నోట్ పెట్టారు.
‘‘2023లో కూడా ఇంకా మతపరమైన వివక్షలు ఉండడం విచారకరం. నేను ఆ దైవం దగ్గరకు వెళ్లలేకపోయా. దూరం నుంచే ఆ అనుభూతిని పొందగలిగా. మతపరమైన భేదాలు తొందరలోనే సమసిపోతాయని భావిస్తున్నా. మతపరంగా కాకుండా మనమంతా ఒక్కటే అని చెప్పే సమయం తప్పక వస్తుంది’’ అని అమలాపాల్ రిజిస్టరులో రాశారు.
అయితే అమలాపాల్ ను అడ్డుకోవడానికి సంబంధించి ట్రస్టు కార్యదర్శి స్పందించి తాము నిబంధనలు మాత్రమే అమలు చేశామని చెప్పడం విశేషం. ప్రతిరోజూ ఇతర మతాల వాళ్లు ఎందరో వస్తుంటారు. వారి గురించి ఎవరికీ తెలియదు. సెలబ్రిటీలు వచ్చినప్పుడు వివాదం అవుతుంది అని పేర్కొన్నారు.
ఒక ఆలయానికి వెళ్లినప్పుడు అక్కడి ఆలయ మర్యాదలను, నియమాలను, సాంప్రదాయాలను గౌరవించడం, పాటించడం అనేది కనీస బాధ్యత. తిరుమలలో సైతం ఇతర మతస్తులు వచ్చినప్పుడు.. అక్కడ రిజిస్టరులో సంతకం చేస్తే దర్శనానికి అనుమతిస్తారు. సోనియా వంటివారు వచ్చినప్పుడు కొన్నిసార్లు వివాదం అయింది. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా.. ఆమె ప్రవేశాన్ని నిషేధించిన హిందూ ఆలయాలు ఉన్నాయి. అయితే ఎవ్వరూ ఇలా నెగటివ్ వ్యాఖ్యలు చేయలేదు. ఆయా ఆలయాల నిబంధనలను గౌరవించారు.
అమలాపాల్ ఈ వ్యాఖ్యలతో చాలా ఓవర్ యాక్షన్ చేసిందని నెటిజన్లు మండిపడుతున్నారు. 2023లో ఇంకా మతపరమైన వివక్షలు ఉన్నాయంటూ ఆలయ మర్యాద గురించి మాట్లాడడం తగదంటున్నారు. దీనిని వివక్ష అనడానికి వీల్లేదు. అమలాపాల్ కు అంతగా సర్వమత సమానత్వం వంటి ఆధునిక భావనలు ఉంటే.. నో కాస్ట్ నో రెలిజియన్ లాంటి చెందను అని తన అస్తిత్వాన్ని మార్చుకోవచ్చు. అప్పుడు ఎలాంటి నిబంధనలు వర్తించవు. ఒక మత గుర్తింపును కోరుకుంటూ, మరో మతం ఆలయానికి వెళ్లాలనుకోవడం తప్పు కాదు. కానీ, అక్కడి నిబంధనలను గౌరవించకపోవడం మాత్రం తప్పు. నిబంధనలను విమర్శించడం అదేదే మత వివక్ష అన్నట్టుగా రంగుపులిమి ప్రచారం చేయడం మాత్రం తప్పు అని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles