సాక్షి సర్క్యులేషన్ కేసులో సీఎం జగన్ కు `సుప్రీం’ నోటీసులు

Tuesday, April 23, 2024

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి తమ కుటుంబ యాజమాన్యంలోని సాక్షి పత్రికకు ప్రభుత్వ పరంగా ఆర్ధిక వనరులు సమకూర్చడంతో పాటు అధికారాన్ని ఆసరాగా చేసుకొని పత్రిక సర్క్యూలేషన్ పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

సాక్షి యాజమాన్యంలో కీలకంగా ఉన్న వ్యక్తులకు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ఇప్పించి, వారి జీత బత్యాలను ప్రభుత్వం చెల్లించేటట్లు, వారి మాత్రం సాక్షికి ఉచితంగా సేవలు అందించేటట్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతగా నిధులు క్రుమ్మరిస్తున్నా సర్క్యూలేషన్ లో నం 1 స్థానంకు చేరుకోలేక పోవడంతో ప్రభుత్వ నిధుల నుండే  సరఫరా చేయడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో సాక్షి అమ్మకాలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతి, రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రతినిధు లకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులిచ్చింది.  వైఎస్‌ జగన్‌ యాజమాన్యంలో, నియంత్రణలో ఉన్న సాక్షి దినపత్రికను అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమ్మకాలను మెరుగుపరచ డానికి ఉద్దేశించిన ప్రభుత్వ ఉత్తర్వు (జిఒ)ను వ్యతిరేకిస్తూ ఈనాడు యాజమాన్యంలోని ఉషో దయ పబ్లికేషన్స్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ జిఓను రద్దు చేసేందుకు నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను సిజెఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహ, జస్టిస్‌ జెబి పార్దీవాలాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

ఉషోదయ పబ్లికేషన్‌ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ సాక్షి చందా నెలకు రూ.176.50 అని, ఈనాడు చందా నెలకు రూ.207.50 అని తెలిపారు. గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయం సాక్షి పేపరు వేయించుకునేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకం గానే అదనపు గ్రాంట్‌ కింద నెలకు రూ.200 మంజూరు చేస్తూ జిఓ ఇచ్చిందని తెలిపారు.

ఈ రకంగా సాక్షి సర్క్యూలేషన్‌ పెంచుకోవడానికి ప్రయత్ని స్తుందని పేర్కొన్నారు. సాక్షికిముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి యజమాని అని పేర్కొ న్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో ఉన్న వ్యతిరేక తను ఈనాడు పై దాడి చేయాలనుకుంటున్నారని తెలిపారు.

ఈనాడు ఎల్లో జర్నలిజమని, దాని జోలికి వెళ్లవద్దని ప్రభుత్వం కూడా చెప్పిందని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రచారమని, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కూడా చేశారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం నోటీసులు జారీ చేసి, ఏప్రిల్‌ 10కి విచారణ వాయిదా వేసింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles