వైసిపిలో `వై నాట్ 175′ పొగరు ఆవిరైపోయిందా!

Thursday, March 28, 2024

ఏపీలో తమకు తిరుగే లేదనుకుంటూ ఇప్పటివరకు విర్రవీగుతున్న వైసిపి నేతలలో ఎమ్యెల్సీ ఎన్నికలలో ఎదురైనా ఎదురు దెబ్బలతో పొగరంతా ఆవిరైపోయిన్నట్లు కనిపిస్తున్నది. మొన్నటివరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి సాధారణ పార్టీ నాయకులు కూడా `వై నాట్ 175… కుప్పం కూడా’ అంటూ ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు. కానీ ఇప్పుడా పొగరు కనబడటం లేదు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గతంలో కంటే మరిన్ని స్థానాలు అధికంగా వస్తాయి తప్ప, ఎక్కడా సీట్లు తగ్గవని అంటి మాత్రమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సంఖ్యలు  చెప్పడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పుడు టిడిపి నేతలో రెట్టించిన ఉత్సాహంతో `వై నాట్ పులివెందుల’ అంటూ మాట్లాడుతూ ఉంటె వైసిపి నేతల నోట మాటలు రావడం లేదు.

ఎమ్యెల్సీ ఎన్నికల అనంతరం సీఎం జగన్ మొదటిసారిగా ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్‌ఆర్‌ ఆసరా మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటూ డ్వాక్రా మహిళలను ఉద్దేశించి చేసిన ప్రసంగం అధికారపక్షం నేతలకే విస్మయం కనిపించింది. ఆయన ప్రసంగంలో ఎక్కడా ప్రతిపక్షాలపై దూకుడు కనిపించలేదు. సవాళ్లు లేవు. `వై నాట్ 175… `’ అంటూ ప్రశ్నలు కూడా లేవు.

సింహం సింగల్ గానే వస్తుందంటూ ఒంటరిగా పోటీ చేయమని ప్రతిపక్షాలకు సవాళ్లు విసిరే సాహసాం కూడా చేయలేకపోయారు. ఒంటరిగా పోటీ చేసినా టిడిపిని ఎదుర్కోవడం కష్టమని గ్రహించినట్లున్నారు. ప్రజలలో తన పాలన పట్ల నెలకొన్న తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకతను ఎమ్యెల్సీ ఎన్నికలు స్పష్టం చేశాయని గ్రహించినట్లున్నారు.

జగన్ పర్యటన నేపథ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇచ్చి మరీ ఆయా విద్యాసంస్థలకు చెందిన బస్సులను డ్వాక్రా మహిళలను తరలించేందుకు వినియోగించారు. ఇదివరకు జగన్ సభలలో ఆయన ప్రసంగం ప్రారంభం కాగానే ఒకొక్కరు వెళ్లిపోవడం ప్రారంభిస్తుండేవారు. కానీ ఈ సారి ప్రసంగం ప్రారంభం కాకుండానే వెళ్లిపోవడం ప్రారంభించారు.

దారిపొడువుగా బ్యారికేడ్లు నిర్మించి పోలీసులు హడావుడి చేసినా జనం పెద్దగా జగన్ ను చూడడానికి రాలేదు. దానితో చుట్టూ ఉన్న పొలాలకు దండాలు పెట్టుకొంటూ వెళ్లారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ‘వై నాట్ 175’ అని అంటున్నారని.. తాము, మాత్రం ‘వై నాట్ పులివెందుల’ అంటున్నామని తెలుగు దేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. ఎమ్యెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని నలుగురు ఎమ్యెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే మిగిలినవారు భయపడతారని వేసుకున్న అంచనాలు సహితం తలకిందులైన్నట్లు కనిపిస్తున్నాయి.

పైగా, వారిలో ఇద్దరు చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి హయం నుండి జగన్ కుటుంభంకు సన్నిహితులు కావడం, కాంగ్రెస్ నుండి జగన్ తో పాటు బైటకు రావడమే కాకుండా, తమ పదవులకు సహితం రాజీనామాలు చేసినవారు కావడంతో అంత నమ్మకస్తులు సహితం దూరం కావడం వైసిపి శ్రేణులలో ఆత్మపరిశీలనకు దారితీస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles