వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ జరిగితే పులివెందులలో ఆత్మరక్షణలో జగన్!

Saturday, April 20, 2024

కుప్పంలో చంద్రబాబు నాయుడును ఈ సారి ఓడిస్తామని వైసిపి నాయకులు సవాళ్లు చేస్తుంటే, పులివెందులలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడిస్తామని టిడిపి నేతలు ఎదురు సవాళ్లు చేస్తున్నారు. వాస్తవానికి ఈ సవాళ్ళను సాధారణ ప్రజానీకం పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే, ఇప్పుడు  వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో జగన్ కు సన్నిహితుడైన, వరుసకు సోదరుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెంట సిబిఐ పడుతూ ఉండడంతో అందరికన్నా ఎక్కువగా సీఎం జగన్ ఖంగుతింటున్నారు.

ఈ కేసులో అవినాష్ ను ప్రధాన నిందితుడిగా సిబిఐ భావిస్తున్నట్లు కధనాలు వెలువడుతూ ఉండడం, అందుకు అవసరమైన సంఖ్యల సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినవతుండడంతో అవినాష్ అరెస్ట్ కు అవకాశాలు లేకపోలేదని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే, పులివెందులలో వైఎస్ జగన్ రాజకీయంగా ప్రమాదంలో పడినట్లే అనే చర్చ జరుగుతున్నది.

ఇప్పటివరకు సిబిఐ దర్యాప్తు ఈ కేసులో ముందుకు సాగకుండా ప్రభుత్వపరంగా అడ్డంకులు కల్పిస్తూ వచ్చింది కేవలం అవినాష్ ను కాపాడుకోవడమే అనే వాదనలు వినిపిస్తున్నాయి.  సుప్రీం కోర్టు ఉత్తరువులతో సిబిఐ దర్యాప్తును ఏపీ నుండి తెలంగాణకు మార్చిన వెంటనే సిబిఐ అవినాష్ పై దృష్టి సారించడం, విచారణకు హాజరుకమ్మని నోటీసులు జారీ చేయడం జగన్ శిబిరంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది.

సిబిఐ కోరగానే మంగళవారం విచారణకు హాజరై ఉంటె ఒక విధంగా ఉండేదని, ఐదురోజుల పాటు తనకు ముందే నిర్ణయించిన షెడ్యూల్ ఉన్నట్లు పేర్కొంటూ హాజరుకాలేదని స్పష్టం చేయడంతో పరిస్థితి మరో విధంగా మారే అవకాశం ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు.  కేవలం నోటీసులు జారీచేయడమే కాకుండా, పులివెందులలో రెండు రోజుల పాటు సీబీఐ బృందం తిరగడం, అవినాష్ ఇంటితో పాటు, తండ్రి భాస్కర్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లడం గమనిస్తే వారిద్దరిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని వైసిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

వారిద్దరూ జైలుకు వెడితే పులివెందులలో సీఎం వైఎస్ జగన్ ఒంటరివాడవుతాడని, రాజకీయంగా వ్యవహారాలు నడపడం కష్టమవుతుందని పలువురు భావిస్తున్నారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి హయం నుండి వారి కుటుంభానికి పులివెందుల కంచుకోటగా ఉంటూ వస్తున్నది. 1978 నుండి వారు కుటుంభం నుండే అక్కడ ఎన్నికవుతూ వస్తున్నారు.

అయితే, అక్కడి రాజకీయ వ్యవహారాలు అన్నింటిని మృతి చెందిన వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలే చూసుకొంటూ ఉండేవారని చెబుతున్నారు. వివేకానందరెడ్డి మృతి చెందడంతో ఇప్పుడు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి మాత్రమే మిగిలారని గుర్తు చేస్తున్నారు.

అందుకనే కడప లోక్ సభ సీట్ .లో పోటీకి వివేకానంద రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల మధ్య పోటీ జరిగినా, వారందరిని కాదని జగన్ అవినాష్ రెడ్డిని ఎంపిక చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే సొంత బంధువుల నుండే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్ కు వారిద్దరూ లేకుండా పులివందల నుండి తిరిగి ఎన్నిక కావడం సవాల్ గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి వంటి ముఖ్యమైన వ్యక్తి హత్య కేసు విచారణ సంవత్సరాలు పడితే సాధారణ ప్రజల కేసుల పరిస్థితి ఏంటని స్వయంగా జగన్ సోదరి వైఎస్ షర్మిల అదే సమయంలో ప్రశ్నించడం గమనార్హం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో ఆలస్యంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా విచారణ ఆలస్యమైతే.. ప్రజలకు సీబీఐపై నమ్మకం ఉంటుందా అని ఆమె ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేసులో నిజా నిజాలు తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. దోషులను పట్టుకుని శిక్షించాలని స్పష్టం చేశారు అంటూ ఆమె ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.

అవినాష్ రెడ్డికి నోటీసులు సిబిఐ నోటీసులు పంపిన సమయంలోనే ఆమె ఈ విధమైన వాఖ్యలు చేయడం రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.  దోషులు అంటూ ఆమె  పరోక్షంగా వైసీపీ నేతల గురించి చెప్పారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఫైళ్లు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయ్యాయి. కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి హైదరబాద్ సీబీఐ కోర్టుకు ఫైల్స్ చేరాయి. వివేక హత్య కేసుకు సంబంధించి మూడు బాక్సుల్లో చార్జిషీట్లు, సాక్షుల వాంగ్ములం, ఫైల్స్ తరలించారు.

వివేకా హత్యకు సంబంధించి కడప కోర్టులో ఐదుగురు నిందితులపై రెండు చార్జిషీట్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఫైల్స్ తో పాటు ఇతర సంబంధిత వాంగ్ములాలతో పాటు అన్నింటిని హెచ్డీఎరాబాద్  సీబీఐ కోర్టుకు బదిలీ చేశారు. ఇప్పుడవన్నీ బదిలీ అయిన క్రమంలో హైదరాబాదులోని సీబీఐ న్యాయస్థానం త్వరలోనే వివేకా హత్య కేసు విచారణను ప్రారంభించనుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles