బడ్జెట్ పై పెదవి విరుస్తున్న తెలంగాణ నేతలు

Tuesday, April 16, 2024

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు మొక్కుబ‌డిగానే కేటాయింపులు జ‌రిగాయి. ముఖ్యంగా ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో అధికారంలోకి రావాలని చూస్తున్న బిజెపి తెలంగాణకు కేటాయింపుల పట్ల ఆసక్తి చూపకపోవడం విస్మయం కలిగిస్తుంది.

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా విష‌యంపై కేంద్రం అస‌లు ప‌ట్టించుకోలేదు. ఒక‌ర‌కంగా కేటాయింపుల‌లో తెలంగాణ‌కు అంత ప్రాధాన్య‌త ల‌భించ‌డం లేదు.అందమైన మాటలు తప్ప నిధుల కేటాయింపులో అంతా డొల్లనే అని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తేల్చారు. రైతులను. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతన్నలకు సంబంధించి జీఎస్టీ రాయితీలు, వారికి ప్రత్యేక ప్రోత్సాహాలు ఊసే లేదన్నారు.

కొత్త రాష్ట్రానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనేకసార్లు కోరినా… ఇప్పటి వరకు ఇచ్చిందేమీ లేదని దుయ్యబట్టారు. ఈ బడ్జెట్‌లోనూ తెలంగాణకు మెండి చేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వాడలకు సంబంధించి తెలంగాణకు ఒక్కటంటె ఒక్కటి కూడా కొత్తగా కేటాయింపులు లేవన్నారు. బడ్జెట్‌లో రైతులకు సంబంధించిన నిధుల్లో భారీగా కోత పెట్టారని… ఎరువుల సబ్సిడీలు తగ్గించారని హరీశ్ మండిపడ్డారు.

కేంద్రం బాగా పనిచేస్తున్న రాష్ట్రాలపై ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని అతిగా అమలుచేస్తూ తాను మాత్రం ఎప్పటికప్పుడు ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలను ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు.

కొత్త బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగినదని బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు డా. కేశవరావు, నామ నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. హైదరాబాద్ కు ఐటీఐఆర్ కేటాయించాలని ఎన్నోసార్లు కోరినా.. బడ్జెట్ లో కేటాయించలేదని ఎంపీ సురేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గురించి మాట్లడలేదని, గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమేనని విమర్శించారు. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించలేదని గుర్తు చేశారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ కోసం ప్రత్యేక ప్రకటలేమీ లేవని, నిరుత్సాహపరిచిందని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంపతృప్తి వ్యక్తం చేశారు. పునర్విభజన చట్టాన్ని ఆమెదించి పదేళ్ళు అవుతునా, ఇప్పటి వరకు బిజెపి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు.

ఆదాయం పన్ను రాయితీని రూ. 7లక్షలకు పెంచడం వల్ల తెలంగాణ ప్రజలకు లభించే ఉపయోగం ఏమీ ఉండదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.  ఇది కొన్ని రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్‌గా ఆమె అభివర్ణించారు.

ఆదాయం పన్ను రాయితీని రూ. 10 లక్షల వరకు పెంచుతారని తాము ఆశించామని, తెలంగాణలో ప్రజలకు జీతాలు చాలా ఎక్కువ ఉన్నాయని, రూ. ఆదాయం పన్ను రాయితీ 10 లక్షలు పెరిగితే తెలంగాణ ప్రజలకు ఉపయోగ పడుతుందని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు, బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రమే అభివృద్ధి ప్రాజెక్టులను బడ్జెట్‌లో ప్రకటించిందని కూడా కవిత విమర్శించారు.

197 నర్సింగ్ కాలేజీలు ప్రకటించారని… ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కోసం రూ. 5300 కోట్లు ఇచ్చారన్నారు. మరి కాళేశ్వరం, మిషన్ భగీరథ సంగతేంటని ప్రశ్నించారు. నీతి అయోగ్ చెప్పినా ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

బడ్జెట్ రైతులను, పేదలను దగా చేసి అదానీ, అంబానీలను ఆదుకునే బడ్జెట్‌లా ఉన్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వం చివరి బడ్జెట్ లో కూడా పసుపుబోర్డుకు మొండిచేయి చూపింద‌న్నారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికలహామీని నెరవేర్చక పసుపు రైతులను వంచనకు గురిచేశార‌ని మండిపడ్డారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles