జగన్ ప్రభుత్వంకు ఏపీ పట్టభద్రుల చెంపదెబ్బ!

Friday, April 19, 2024

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఉద్యోగులు, విద్యావంతులలో నెలకొన్న ఆగ్రవేశాలు మూడు పట్టభద్రుల స్థానాల నుండి శాసనమండలికి జరిగిన ఎన్నికలలో స్పష్టం అయ్యాయి. మూడు చోట్లకూడా టిడిపి అభ్యర్థులు భారీ ఆధిక్యతలో ముందంజలో ఉన్నారు.

ఎన్నికల నిబంధనలను తుంగలోకి త్రొక్కి ఎంతగా అధికార దుర్వినియోగం జరిపినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేసినా అధికార పార్టీ అభ్యర్థులకు పట్టభద్రుల నుండి తిరస్కారం ఎదురైంది. ఎక్కడా కూడా బిజెపి అభ్యర్థులు పోటీలోనే లేరు.

ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో టీడీపీ హవా కనిపిస్తుండగా, పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, వైఎస్సార్‌సీపీ పోటీ పడుతున్నాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. ఇక్క టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ పై ఆయన 20 వేలకు పైగా భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఉత్తరాంధ్రలో టిడిపి పట్టభద్రుల స్థానం నుండి ఎమ్యెల్సీ సీట్ గెలుపొందడం ఇదే మొదటిసారి. గత ఎన్నికలలో టిడిపి మద్దతుతో తెలుపొందిన బిజెపి అభ్యర్థి పివిఎన్ మాధవ్ కు 9,000 మెజారిటీ మాత్రమే వచ్చింది. అప్పుడు టిడిపి అధికారంలో ఉన్నప్పటికన్నా ఇప్పుడు రెట్టింపుకు పైగా టిడిపి అభ్యర్ధికి మెజారిటీ రావడం వైసీపీ పాలనపట్ల విద్యావంతులు ఎంతగా విసిగి వేసారి ఉన్నారో వెల్లడవుతుంది.

మరోవైపు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ఐదవ రౌండ్ ముగిసేసరికి తమ సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డిపై 16,929 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి 1,943 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడు రౌండ్లలో రవీంద్రరెడ్డి 28,872 ఓట్లు రాగా.. తెలుగు దేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 26,929 ఓట్లు పడ్డాయి.

అనంతపూర్ కౌంటింగ్ కేంద్రంలో కొంతమంది మీపంలోని కాలనీ నుండి ఏవిధమైన గుర్తింపు కార్డులు లేకుండా లోపలికి ప్రవేశించి కౌంటింగ్ పక్రియను తారుమారు చేసే ప్రయత్నాలు చేశారు. టిడిపి మద్దతుదారులు తీవ్రంగా ప్రతిఘటించారు. విశాఖపట్నంలో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఎ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించడంతో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

పోస్టల్ బాలట్ లో 40 శాతంకు పైగా ఓట్లు చెల్లకపోవడం గమనార్హం. కొద్దిమంది మాత్రమే పోస్టల్ బాలట్ ను ఉపయోగించి కొంటుంటారు. దానితో ఎవ్వరు ఎవ్వరికీ ఓటు వేసారో తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికార పార్టీ అభ్యర్థి పట్ల తమ వ్యతిరేకతను ఈ విధంగా తెలిపినట్లు తెలుస్తున్నది.

కాగా ఎన్నికలలో అధికార పార్టీ పాల్పడిన అక్రమాలు, అధికార దుర్వినియోగంపై నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమీషనర్ కు లేఖ వ్రాసారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles